తెలంగాణ

telangana

ETV Bharat / state

Jabardasth Comedian Arrested : ప్రేమ పేరుతో మోసం​.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ - జబర్దస్త్​ కమెడియన్​పై కేసు నమోదు

Jabardasth Comedian Arrested : జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమై తమదైన శైలిలో రాణిస్తున్నారు. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. అయితే ఈ జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్, సింగర్​ నవ సందీప్​పై మధురానగర్​ పీఎస్​లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. తాజాగా కమెడియన్​ నందీప్​ని పోలీసులు అరెస్టు చేశారు.

Jabardast Artist Nava sandeep Arrest
Jabardasth Comedian Nava Sandeep

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 12:57 PM IST

Jabardasth Comedian Arrested :'నీవు లేనిదే.. నేను లేను' నీతోనే జీవితం.. నిన్నే ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ప్రియుడి మాటలు నమ్మింది ఆ యువతి. మనసిచ్చిన ప్రియుడే తనను మనువాడతాడనుకుని సర్వస్వం అతనికి అర్పించింది. తీరా పెళ్లికి నిరాకరిస్తుండటంతో నిలువునా మోసపోయానని గుర్తించింది. చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్​ మెట్లు ఎక్కింది. ప్రియుడిపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మధురానగర్ పోలీసులు కమెడియన్ నవ సందీప్​ని అరెస్టు చేశారు.

Attack On Lovers At Gadwala : ప్రేమ వివాహం.. పోలీస్​స్టేషన్​లోనే లవర్స్​పై దాడి.. రోడ్డుపై పరుగులు తీసిన జంట

పోలీసులు తెలిపిన వివాల ప్రకారం..జబర్దస్త్​ కమెడియన్ (Comedian Nava Sandeep), గాయకుడు నవ సందీప్ ప్రేమ పేరుతో ఓ యువతి(28) జీవితంతో ఆడుకున్నాడు. 2018లో యువతితో ఫోన్లో వాట్సాప్ఛాటింగ్​తో పరిచయంపెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. ఈ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో ప్రియురాలిని తన స్వగ్రామం నుంచి హైదరాబాద్​కు రప్పించుకున్నాడు. షేక్‌పేటలోని అల్‌ హమారా కాలనీలోని ఓ హాస్టల్​లో ఉంచాడు. ఆమె 4 ఏళ్లుగా అక్కడే ఉంటుంది.

Jabardast Artist Nava sandeep Arrest : ఈ క్రమంలో నవ సందీప్ యువతిని పలుమార్లు ఓయో, హోటళ్లకు తీసుకెళ్లి తన కోరికలు తీర్చుకున్నాడు. ప్రతిసారి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. యువతితో శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా ఆ యువతి పెళ్లి చేసుకోవాల్సిందే అనే సరికి చేతులు దులిపేసుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే.. పెళ్లి లేదు.. ఏం లేదంటూ మాటను మార్చేశాడు. 'నిన్ను పెళ్లి చేసుకోలేను.. నువ్వంటే నాకిష్టం లేదంటూ' తేల్చి చెప్పాడు. తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నానని అన్నాడు.

Cheating Case on Jabardasth Comedian Nava Sandeep :దీంతో తాను మోసపోయానని గ్రహించింన బాధిత యువతి.. పోలీసులను ఆశ్రయించింది. గోల్కొండ పోలీసుల దగ్గర తన గోడును వెల్లబోసుకుంది. వేరే అమ్మాయిని మనువాడతానని ప్రియుడు చెబుతున్నాడని వాపోయింది. ఇప్పుడు తన జీవితం అంధకారమైందని.. అటు ఇంట్లోంచి బయటికొచ్చి తల్లిదండ్రులకు దూరమయ్యానని.. ఇటు ప్రియుడి చేతిలో మోసపోయానని.. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో గోల్కొండ పోలీసులు జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేసి.. కేసును మధురానగర్ ఠాణాకు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన మధురానగర్ పోలీసులు తాజాగా కమెడియన్ నవ సందీప్​ను అరెస్టు చేసి, రిమాండ్​కు తరలించారు.

Case Filed on Jabardasth Comedian Nava Sandeep : యువతిని శారీరకంగా వాడుకుని మోసం..! జబర్దస్త్​ కమెడియన్​పై కేసు నమోదు

పెరుగుతున్న అఘాయిత్యాలు! : ఏదేమైనా.. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పసి పాప నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవరినీ వదలడంలేదు. వావి వరసలను మరచి.. పశువుల్లా ప్రవర్తిస్తూ.. తమ కామ వాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. బెదిరించి ఒకడు, బ్లాక్​ మెయిల్​తో మరొకడు, స్నేహం పేరుతో ఇంకొకడు, ప్రేమ పెళ్లి.. ఇలా 'అఘాయిత్యానికి పాల్పడేందుకు అడ్డదారులెన్నో' అన్నట్లుగా బంధువులు, పరిచయస్థులు, తెలిసిన వారు, స్నేహితుల ముసుగు తొడిగిన వారే ఎక్కువగా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు బయటకు రావాలన్నా భయపడేలా చేస్తున్నారు.

Facebook Love Story: ఫేస్​బుక్ ప్రేమకథా చిత్రమ్..! ఒక్కటైన చిత్తూరు యువకుడు శ్రీలంక యువతి

Sarpanch Daughter Love Marriage : కుమార్తె ప్రేమ విహహం.. భర్త, అతని స్నేహితుల ఇళ్లను తగలబెట్టించిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details