ఎన్నో సవాళ్లు, ఒత్తిడి ఉండే సినీ రంగంలో రాణించడం అంత సులువైన విషయం కాదని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు డాక్టర్ బంటి సంగీత జీవిత రజతోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత స్థాయికి ఎదగాలంటే.... వ్యక్తిత్వం, బుద్ధి, వికాసంతో పాటు భగవంతుని దీవెన, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలన్నారు.
'సినీరంగంలో రాణించడం అంత సులువు కాదు' - సంగమం ఫౌండేషన్
వెండితెరకు, బుల్లితెరకు చాలా తేడా ఉంటుందని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. బుల్లితెరపై ఒత్తిడి తక్కువగా ఉండి.. పని చేసే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
'సినీరంగంలో రాణించడం అంత సులువు కాదు'
ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, నన్నపనేని రాజకుమారి, నటి గీతాంజలి, శ్రుతి తదితరులు పాల్గొన్నారు. బుల్లితెర పాటల విభావరిలో పలువురు గాయనీ, గాయకులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి : గండి పూడ్చిన నకిరేకల్ శాసనసభ్యుడు
Last Updated : Aug 6, 2019, 9:12 AM IST