హైదరాబాద్‌లోని హెటిరో డ్రగ్స్ సంస్థలపై నాలుగో రోజు కూడా ఐటీ దాడులు(IT Raids on Hetero Drugs) కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో సంస్థకు చెందిన పలు కంపెనీల్లోని ప్రైవేటు లాకర్లలో దాదాపు రూ.142 కోట్ల నగదును ఐటీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పాటు మూడు కిలోలకు పైగా బులియన్ రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు(IT Raids on Hetero Drugs) వెల్లడించాయి.
స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి, నోట్ల పరిశీలన నిమిత్తం భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన ప్రత్యేక బృందాలను రప్పించినట్లు సమాచారం. నోట్లను పరిశీలించి లెక్కింపు పూర్తయ్యాక... ఆ మొత్తాన్ని ఎస్బీఐ సెస్‌కు తరలించే అవకాశం ఉంది. అదే విధంగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నగదు, బంగారంపై ఆరా తీసేందుకు(IT Raids on Hetero Drugs) మరొక ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఆ బృందం నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న ప్రైవేటు లాకర్లకు నిర్వాహకులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6 నుంచి ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో హెటిరోకు చెందిన సంస్థల్లో ఐటీ సోదాలు నిర్వహించింది.
ఇదీ చదవండి:IT Raids on Hetero: హెటిరో సంస్థలపై ఐటీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం