తెలంగాణ

telangana

ETV Bharat / state

మై హోమ్ గ్రూప్​ కార్యాలయాల్లో ఐటీ సోదాలు - MY HOME GROUP

ప్రముఖ వ్యాపార సంస్థ మైహోంలో ఐటీ అధికారులు తనీఖీలు నిర్వహించారు. బెంగుళూరు నుంచి వచ్చిన ఐటీ అధికారులు హైదరాబాద్​ సిబ్బందితో కలిసి ఈ సోదాలు నిర్వహించారు.

మై హోమ్ గ్రూప్​ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

By

Published : Jul 5, 2019, 8:33 AM IST

మై హోమ్ గ్రూప్​ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ప్రముఖ స్థిరాస్తి వ్యాపార సంస్థ మైహోం గ్రూప్ కార్యాలయాల్లో గురువారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు హైదరాబాద్ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు జరిపారు. దాదాపు 50 మంది ఇందులో పాల్గొన్నారు. బెంగళూరులోని ఓ స్థిరాస్తి సంస్థతో మైహోం గ్రూప్ 2017లో ఓ ప్రాజెక్టులో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై వచ్చిన ఫిర్యాదుల్లో భాగంగా అక్కడి ఆదాయపన్ను అధికారులు తొలుత బెంగళూరులోని స్థిరాస్తి సంస్థకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇదే సంస్థతో భాగస్వామిగా ఉన్నందున గురువారం మైహోం గ్రూపులోనూ సోదాలు చేశారు. హైదరాబాద్​లోని నందిహిల్స్, మాదాపూర్, బేగంపేటలలో తో పాటు మెుత్తం ఐదు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. హైదరాబాద్ చేరుకున్న బెంగళూరు అధికారులు స్థానిక ఉద్యోగులతో కలిసి సోదాలు మెుదలుపెట్టారు. రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details