KTR ON IT: రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గతేడాదిలోనే లక్షన్నర ఉద్యోగాలు హైదరాబాద్‌లో వచ్చాయని మంత్రి తెలిపారు. కరోనా ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు పెరిగాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 2021-22 ఏడాదికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు.
ఐటీలో 8 ఏళ్లుగా తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా ఉన్నా గతేడాది అంచనాలకు మించి రాణించామని తెలిపారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ సాధించామని వెల్లడించారు. గతేడాది దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తే.. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నర వచ్చాయని తెలిపారు.
ఐటీలో 8 ఏళ్లుగా అద్భుతమైన పురోగతి సాధించాం. కరోనా ఉన్నా గతేడాది అంచనాలకు మించి రాణించాం. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం వృద్ధి సాధించాం. జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ సాధించాం. హైదరాబాద్‌లో 8 ఏళ్లుగా ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. ఏడాదిలో లక్షన్నర ఉద్యోగాలు హైదరాబాద్‌లో వచ్చాయి. హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు పెరిగాయి. - కేటీఆర్, ఐటీశాఖ మంత్రి