ఐటీ ఉద్యోగులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల కోరారు. దాదాపు 6లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో 40శాతం పై చిలుకు రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐటీ ఉద్యోగుల కీలక పాత్ర
ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐటీ అనుబంధ రంగాల్లోని ఉద్యోగుల ఓట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. దాదాపు 6లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో 40శాతం పై చిలుకు.. రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోషియేషన్(టీటా) పేర్కొంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐటీ ఉద్యోగుల కీలక పాత్ర
గతేడాది లాక్డౌన్ సమయంలోనే.. టెక్కీలు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారని సందీప్ వివరించారు. ఎమ్మెల్సీలుగా గెలుపొందినవారు ఐటీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి:'హెచ్4 వీసాల జారీలో తీవ్ర జాప్యం'