A new approach to road repairs: తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక చొరవతో చేపట్టిన తెలంగాణ ఏఐ మిషన్ ఓ కొత్త ఛాలెంజ్‌ను ప్రారంభించింది. నగరంలో ఉన్న గుంతలను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ద్వారా గుర్తించి వాటి తీవ్రతను తెలుసుకొని తగిన చర్యలు చేపట్టడం కోసం ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంతో క్యాప్ జెమిని భాగస్వామిగా ఉండనుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించి ధరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. ఆసక్తి ఉన్నవారు www.taim-gc.in/mobility వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోనే కాదు....దేశంలో ఉన్న ఆవిష్కర్తలందరూ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి కాన్సెప్ట్ ప్రూఫ్ తయారు చేయటం కోసం నాలుగు వారాల గడువు ఇవ్వబడుతుంది.