కృష్ణాష్టమిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ టెంపుల్లో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇస్కాన్ టెంపుల్‌ను రకరకాల పూలు, పండ్లతో అలంకరించారు. శ్రీకృష్ణుని సుందర రూపాన్ని దర్శించుకోవడానికి ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడికి హారతులు ఇస్తూ భక్తిగీతాలు ఆలపిస్తూ భక్తులు తరించి పోయారు. చిన్న పిల్లలు కృష్ణుని వేషధారణలో గుడికి వచ్చి చూపరులను అలరించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. శ్రీకృష్ణునికి సంబంధించిన భగవద్గీత, మహాభారతం పుస్తకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు... - ఇస్కాన్ టెంపుల్
సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ పరిసరాలను వివిధ రకాల పూలు పండ్లతో సుందరంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నామ స్మరణతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
శ్రీకృష్ణాష్టమి వేడుకలు..ఇస్కాన్‌కు పోటేత్తిన భక్తులు
ఇదీ చూడండి: సుమనోహరమైన శ్రీకృష్ణ రూపం