రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చటం, నీటిపారుదల శాఖలో తీసుకురావాల్సిన మార్పులు.. తదితరాలపై సంస్కరణలు చేపట్టేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 21న శాఖలోని ఇంజినీర్ ఇన్ చీఫ్‌ల సారథ్యంలోని విభాగాలన్నింటితో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య సమావేశ మందిరంలో కార్యశాల నిర్వహణకు నిర్ణయించారు.
ఈనెల 21న నీటిపారుదల శాఖ కార్యశాల - irrigation review latest news
నీటిపారుదల శాఖలో కీలక సంస్కరణలు తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. దీనికి సంబంధించి సీఎం ఇప్పటికే అధికారులకు పలు సూచనలు చేశారు. ఈక్రమంలో తెలంగాణ నీటిపారుదల శాఖ సంస్కరణలు చేపట్టేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈనెల 21న కార్యశాల నిర్వహించాలని నిర్ణయించింది.
మంగళవారం ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించగా.. శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారం సిద్ధం చేసుకొని.. కొన్ని రకాల సూచనలతో సీఎంకు ఒక నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. అనంతరం సీఎంతో సమావేశమవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 21న నిర్వహించనున్న కార్యశాలలో.. సాగు భూములకు నీరందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీలు, కాలువల వ్యవస్థ, నిర్వహణ, ప్రాజెక్టుల కింద సాగు నీరు అందని ఆయకట్టు ఎక్కడ ఉందో గుర్తించటం, ప్రతి ప్రాజెక్టు సన్నద్ధత, నిర్వహణ, శాఖాపరమైన నిర్ణయాలు, ఎత్తిపోతల పథకాలు, పైపులైన్ల ద్వారా సాగునీటి సరఫరా వంటి తదితర అంశాలపై ఈ కార్యశాలలో చర్చించనున్నారు.
ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్ అనుచరుల వీరంగం