తెలంగాణ

telangana

ETV Bharat / state

20 మంది సీనియర్ ఐపీఎస్​ అధికారుల బదిలీ - రాష్ట్ర డీజీపీగా రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు

IPS Officers Transfers in Telangana : రాష్ట్రవ్యాప్తంగా 20 మంది సీనియర్​ ఐపీఎస్​ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. మాజీ డీజీపీ అంజనీ కుమార్​ను రోడ్డు భద్రతా విభాగం ఛైర్మన్​, ప్రింటింగ్​ అండ్​ స్టేషనరీ​ కమిషన్​కు బదిలీ చేసింది.

IPS Officers Transfers
IPS Officers Transfers in Telangana

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 9:05 PM IST

Updated : Dec 19, 2023, 9:16 PM IST

IPS Officers Transfers in Telangana :రాష్ట్రంలో మరో 20 మంది సీనియర్ ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవిగుప్తా(Ravi Gupta)ను కొనసాగిస్తూ పూర్తి బాధ్యతలు అప్పగించింది. రోడ్డు భద్రతా విభాగం ఛైర్మన్​గా అంజనీ కుమార్​ను నియమించింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్​గా అంజీనీ కుమార్​కు అదనపు బాధ్యతలు కేటాయించింది. పోలీస్ హౌసింగ్ సొసైటీ ఛైర్మన్​గా ఉన్న రాజీవ్ రతన్​ను బదిలీ చేసి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్​మెంట్ డీజీగా నియమించింది. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ పోలీస్ అకాడమీ(Telangana Police Academy) డైరెక్టర్​గా అభిలాష బిస్త్ నియమించిన ప్రభుత్వం, ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న ఏఆర్ శ్రీనివాస్​ను ఏసీబీ డైరెక్టర్​గా నియమించింది. జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రాను నియమించింది. సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్​ను నియమించిన ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్​గా అదనపు బాధ్యతలు అప్పగించింది. టీఎస్​ఎస్పీ అదనపు డీజీగా అనిల్​ కుమార్​, ఆబ్కారీ శాఖ డైరెక్టర్​గా వీబీ కమలాసన్​ రెడ్డిలను నియమించింది.

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ - హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

20 IPS Officers Transfers in Telangana :హోంగార్డ్స్​ ఐజీగా స్టీఫెన్​ రవీంద్రను నియమించింది. అదనంగా వెల్ఫేర్​ అండ్​ స్పోర్ట్స్​ విభాగాన్ని అప్పగించింది. హైదరాబాద్​ మల్టీ జోన్​ ఐజీ-2గా తరుణ్​ జోషీని ప్రభుత్వం నియమించింది. అలాగే మల్టీ జోన్​ -1 ఐజీగా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఐజీ పర్సనల్​గా చంద్రశేఖర్​ రెడ్డి, సీఐడీ డీఐజీగా రమేశ్​ నాయుడు, సీఏఆర్​ హెచ్​ క్వార్టర్స్​ సంయుక్త కమిషనర్​గా సత్య నారాయణను నియమించింది. ఇంటెలిజెన్స్​ బ్యూరో డీఐజీగా బి.సుమతిని బదిలీ చేసిన ప్రభుత్వం, మధ్య మండల డీసీపీగా శరత్​ చంద్ర పవార్​ను ప్రభుత్వం నియమించింది.

ఐపీఎస్​ అధికారుల బదిలీల వివరాలు :

  • విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా రాజీవ్‌రతన్‌ నియామకం
  • ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్‌ నియామకం
  • రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్‌
  • జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా నియామకం
  • సీఐడీ డీఐజీగా రమేశ్ నాయుడు
  • సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ సంయుక్త కమిషనర్‌గా సత్య నారాయణ
  • మధ్య మండల డీసీపీగా శరత్‌చంద్ర పవార్‌
  • ఆబ్కారీ శాఖ డైరెక్టర్‌గా కమలాసన్‌ రెడ్డి
  • టీసీపీఎఫ్‌ అదనపు డీజీగా అనిల్‌ కుమార్‌
  • హోంగార్డ్స్‌ ఐజీగా స్టీఫెన్‌ రవీంద్ర
  • హైదరాబాద్‌ మల్టీ జోన్‌ ఐజీ-2గా తరుణ్‌ జోషి, మల్టీ జోన్‌-1 ఐజీగా అదనపు బాధ్యతలు
  • ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్‌ శ్రీనివాస్‌
  • ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్‌ రెడ్డి
  • సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్‌ నియామకం, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు

పాలనను పరుగులు పెట్టించే దిశగా ఆలోచన - త్వరలోనే అధికార యంత్రాంగ ప్రక్షాళణ

తెలంగాణలో కొత్త సర్కార్​ - ప్రభుత్వ అధికారుల పోస్టింగులపై చర్చ - డీజీపీ నుంచి సీఐ వరకు బదిలీలు!

Last Updated : Dec 19, 2023, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details