గుంటూరులో మూడురోజులు క్రితం ఐవీఎఫ్ చికిత్స ద్వారా 73 ఏళ్ళు వయస్సు కలిగిన మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే దీనిపై జాతీయ స్ధాయి వైద్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం నేడు ప్రకటన ఇచ్చింది. అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 45 ఏళ్ల వయస్సుపైబడిన మహిళలకు, 50 ఏళ్లపైబడిన పురుషులకు ఏటువంటి పరిస్ధితిలలో ఐవీఎఫ్ చికిత్సలు చేయబోమని అహల్య ఆసుపత్రి యాజమాన్యం నోటీస్ బోర్డులో ప్రదర్శించింది. అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గత 3 రోజులు క్రితం ఇదే ఆసుపత్రిలో 73 ఏళ్ల మహిళకు ఐవీఎఫ్ చికిత్స ద్వారా కవల పిల్లలు జన్మించారు. ఇప్పుడు ఆ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రకటన కనిపించడం ఆశ్చర్యాలకు గురిచేస్తోంది.
"వయసు పైబడిన వారికి ఐవీఎఫ్ నిషిద్ధం" - ఐవీఎఫ్ నిషిద్ధం
కృత్రిమ గర్భాధారణకు వయస్సు కచ్చితం చేస్తూ ఓ ఆస్పత్రిలో ప్రకటన కనిపించింది. అయితే... 73 ఏళ్ల బామ్మ కవలలకు జన్మనిచ్చిన అదే ఆసుపత్రిలో ఈ బోర్డు కనిపించడం చర్చనీయాంశమైంది.
ఇకపై ఐవీఎఫ్ చికిత్సలు చేయబోం : అహల్య ఆసుపత్రి యాజమాన్యం