Invitation to KTR from International Conference: ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్-ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్.. మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఇటీవల సంస్థకు సంబంధించిన పలు బృందాలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన విధానం, సౌకర్యాలు, వేగంగా నిర్మాణం పూర్తి చేసిన విధానం సంస్థ బృందాన్ని ఆకట్టున్నాయి.
మరో అంతర్జాతీయ సదస్సు నుంచి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం - అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
Invitation to KTR from International Conference: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్-ఎన్వైర్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆహ్వానించింది. మే 21 నుంచి 25 వరకు అమెరికాలోని హెండర్‌సన్ నేవడాలో ఆ సదస్సు జరగనుంది.
KTR
దీంతో ఆ సంస్థ ఎండీ బ్రెయిన్ పార్సన్స్ మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మే 21 నుంచి 25 వరకు అమెరికాలోని హెండర్సన్ నెవడాలో జరగనున్న సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. 2017 మే లో కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటిఆర్.. తెలంగాణ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి ప్రసంగించారు.
ఇవీ చదవండి: