హైదరాబాద్ పంజాగుట్టలోని దుర్గా నగర్లో హత్యకు గురైన రాంప్రసాద్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యంతో పాటు చంపినట్లుగా అనుమానిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాంప్రసాద్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం - ramprasad
విజయవాడ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు ప్రధాన అనుమానితుడు కోగంటి సత్యంతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని ఇప్పటికే గుర్తించిన అధికారులు.. ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు.
రాంప్రసాద్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
హత్య అనంతరం నిందితులు కారులో పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు... ఏ మార్గంలో పారిపోయి ఉంటారనే కోణంలో పరిశీలించారు. మరోవైపు కోగంటి సత్యం దొరకడంతో.. అతడిచ్చిన సమాచారంతో మరో ముగ్గురు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన వారు చోటు, రమేశ్, శ్యామ్‌గా గుర్తించారు. హత్యకు వ్యాపార లావాదేవీలు కారణమని తెలుస్తోంది.
ఇవీ చూడండి: నెలఖారులోగా ఎన్నికలు పూర్తి చేస్తాం