తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల సమావేశంలో వాడివేడిగా చర్చలు జరిగాయి. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య జరిగిన చర్చలు ఆసక్తికరంగా మారాయి. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి జైపాల్ రెడ్డి పేరును మాజీ మంత్రి డీకే అరుణ ప్రతిపాదించగా.. ఆయన పోటీకి ఆసక్తిగా లేరని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గితే ఎలా అంటూ అరుణ ప్రశ్నించారు. అలాంటప్పుడు తన అనుచరులకు అసెంబ్లీ టికెట్లు ఎందుకు ఇప్పించుకున్నారని నిలదీశారు. నాగర్‌కర్నూల్ నుంచి సతీష్ మాదిగ పేరును జాబితాలో చేర్చాలని ఆమె సూచించారు.
ఆసక్తి ఉందా? - tpcc
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా టీపీసీసీ ప్రణాళికలు రచిస్తోంది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై నేతలు చర్చలు జరుపుతున్నారు. ఎంపీ స్థానాలకు సీనియర్ నాయకుల పేర్లను సూచిస్తున్నారు పార్టీ నాయకులు.
వాడివేడిగా చర్చలు
అర్హత ఉన్నవారి పేర్లను మాత్రమే తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పేర్కొనగా డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వాదనను కుంతియా సమర్థించారు. భువనగిరి నుంచి మధుయాష్కీ పేరును జాబితాలో చేర్చటంపై సుధీర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజామాబాద్, భువనగిరి స్థానాల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో మధుయాష్కీ తేల్చుకోవాలని షబ్బీర్ అలీ అన్నారు.
ఇవీ చదవండి:అమ్మవారి దయవల్లే..