తెలంగాణ

telangana

ETV Bharat / state

పండుగకు ప్రత్యేక రైళ్లు... వీటిని పాటించక తప్పదు - రైల్వే సీపీఆర్వోతో ముఖాముఖి

సంక్రాంతి పండుగ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే సాధారణ రైళ్లతో పాటు పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ద.మ.రైల్వే 58 రైళ్లను 801 ట్రిప్పులతో నడిపిస్తుందని సీపీఆర్వో రాకేష్ పేర్కొన్నారు.

పండుగకు ప్రత్యేక రైళ్లు... వీటిని పాటించక తప్పదు
పండుగకు ప్రత్యేక రైళ్లు... వీటిని పాటించక తప్పదు

By

Published : Jan 5, 2021, 2:36 PM IST

సంక్రాంతి పండుగ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే సాధారణ రైళ్లతో పాటు పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ద.మ.రైల్వే 58 రైళ్లను 801 ట్రిప్పులతో నడిపిస్తుందని సీపీఆర్వో రాకేష్ పేర్కొన్నారు. వీటితో పాటు ఇతర జోన్లు ద.మ.రైల్వే జోన్ మీదుగా 99 రైళ్లు 563 ట్రిప్పులతో నడుస్తాయన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్లలో, రైళ్లలో నిత్యం శానిటైజేషన్ చేస్తూ.. స్టేషన్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామని వివరించారు. రిజర్వేషన్ సౌకర్యం ఉన్న వారిని మాత్రమే రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు ప్రయాణం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి ప్రత్యేక రైళ్లపై ద.మ.రైల్వే సీపీఆర్వో రాకేష్ తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖీ.

పండుగకు ప్రత్యేక రైళ్లు... వీటిని పాటించక తప్పదు

ABOUT THE AUTHOR

...view details