అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చీరకట్టుతో ఫ్యాషన్ షోలో వయ్యారాల నడకతో పాటు.. వివిధ సినిమా పాటలకు నృత్యాలు చేస్తూ అదరగొట్టారు. అనంతరం వివిధ క్రీడల్లో.. సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు.
'మహిళలు ఎక్కడ ఉంటే లక్ష్మీ దేవి అక్కడే ఉంటుంది' - Bc Mahila Women's Day
రవీంద్రభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు.

'మహిళలు ఎక్కడ ఉంటే లక్ష్మీ దేవి అక్కడే ఉంటుంది'
మహిళలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ దేవి ఉంటుందని... ప్రతి ఒక్కరూ వారిని గౌరవించాలని వేడుకల్లో పాల్గొన్న వక్తలు కోరారు. సమాజంలోని అన్ని రంగాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. మహిళ సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
ఇదీ చదవండి:ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ!