తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్​ అడ్వాన్స్​డ్​ పరీక్షకు దరఖాస్తు గడువు పెంపు

ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు గడువు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈనెల 29 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీకి హాజరు కావాలని సూచించింది.

ఇంటర్​ బోర్డు

By

Published : Apr 26, 2019, 9:47 PM IST

Updated : Apr 26, 2019, 11:31 PM IST

ఇంటర్మీడియట్ అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్ష దరఖాస్తు గడువును మరో రెండు రోజులు బోర్డు పొడిగించింది. పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుండగా ఈనెల 29 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్​ బోర్డు కార్యదర్శి అశోక్​ తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు పునర్​మూల్యాంకన ఫలితాల కోసం ఎదురు చూడకుండా సప్లిమెంటరీకి హాజరు కావాలని సూచించారు. రీవెరిఫికేషన్​, రీకౌంటింగ్​ దరఖాస్తు తేదీల్లో ఎలాంటి మార్పు లేదని బోర్డు స్పష్టం చేశారు. ఫెయిలైన సబ్జెక్టులకు మాత్రమే ఉచితంగా రీ వెరిఫికేషన్​ ఉంటుందని తెలిపారు.

ఇంటర్​ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
Last Updated : Apr 26, 2019, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details