ఇంటర్మీడియట్ అడ్మిషన్ షెడ్యూలు ప్రకటించక ముందే.. చేపట్టే ప్రవేశాలు చెల్లవని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పష్టం చేశారు. ముందస్తు ప్రవేశాలు చేపట్టే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గుర్తింపు పొందిన కళాశాలల జాబితా ప్రకటించక ముందే తమ పిల్లలను చేర్పించవద్దని తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు సూచించింది. కళాశాలకు గుర్తింపు ఉందా లేదా అనే అంశం ముందుగా పరిశీలించి... నిర్ధరించుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.
'ముందస్తు ప్రవేశాలు చేపట్టే కళాశాలలపై కఠిన చర్యలు'
వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడే విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకోవద్దని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. కొన్ని ఇంటర్ కళాశాలలు తమ సిబ్బందిని తల్లిదండ్రుల వద్దకు పంపించి.. ప్రవేశాల కోసం ముందుస్తు రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆయన పేర్కొన్నారు.
Inter Board secretary said 'Serious action on colleges for early admission'