జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కోసం ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు. అనుబంధ గుర్తింపు పొడిగింపు, అదనపు సెక్షన్లతో పాటు కాలేజీని మరో ప్రాంతానికి తరలించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. గుర్తింపు కోసం అగ్నిమాపక శాఖ ధ్రువపత్రంతో పాటు నిబంధనలకు అనుగుణంగా దస్త్రాలు సమర్పించాలని వివరించారు.
జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కోసం నోటిఫికేషన్ - Inter Board latest Notification
రాష్ట్రంలో జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కోసం ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 24లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.
జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కోసం నోటిఫికేషన్
ఈ నెల 24లోగా దరఖాస్తులు సమర్పించాలని.. రూ.1000 నుంచి రూ.20 వేల వరకు ఆలస్య రుసుముతో జులై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని జలీల్ పేర్కొన్నారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు వీలైనంత ముందుగా ఇవ్వాల్సి ఉన్నందున.. జులై 5 తర్వాత అందే దరఖాస్తులను పరిశీలించమని ఇంటర్ బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:నకిలీ ధ్రువపత్రాలతో కారు లోన్.. హెల్త్ ఇన్స్పెక్టర్ అరెస్ట్