తెలంగాణ

telangana

By

Published : Feb 2, 2020, 7:53 PM IST

ETV Bharat / state

రోడ్డు భద్రతపై పులి, ఎద్దుల మాస్కులతో అవగాహన

రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు కొత్త తరహాలో అవగాహన కల్పించారు. పులి ,ఎద్దు మాస్కులు ధరించి... శిరస్త్రాణం పెట్టుకోని వాహన చోదకులకు హెల్మెట్​ ఆవశ్యకతను వివరించారు.

Traffic Awareness
Traffic Awareness

హైదరాబాద్​ ఎల్బీనగర్​ ట్రాఫిక్​ పోలీసులు వినూత్నరీతిలో ప్రజలకు రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని కొత్తపేటలో ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు పులి, ఎద్దు మాస్కు​లను ధరించి... హెల్మెట్ పెట్టుకోని వారికి వాటిచేత పూలను అందించి... శిరస్త్రాణం ప్రాముఖ్యతను తెలిపారు. గతంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి క్షతగాత్రులను అసుపత్రికి తరలించిన కొందరిని పూలమాలలతో సన్మానించారు.

ప్రతి వ్యక్తి ట్రాఫిక్ నియమాలు పాటించడం వల్ల ప్రమాదాలు నివారించేందుకు అవకాశం ఉంటుందని ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్​స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు చెప్పారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే తలకి గాయమై ప్రాణం పోతుందని... బైక్ పైన వెళ్లేవారు ఇద్దరు ఉంటే ఇద్దరు సైతం హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై ఖాజా, ట్రాఫిక్ సిబ్బంది శంకర్, సుందర్, భాస్కర్, కుమార్ పాల్గొన్నారు.

'రోడ్డు భద్రతపై వినూత్నంగా ప్రజలకు అవగాహన'

ఇదీ చూడండి:'ప్రపంచానికి భారత్​ ఇచ్చిన గొప్ప బహుమతి... ఆధ్యాత్మికత'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details