మంత్రి హరీశ్ రావు(harish rao) భుజాలపై తుపాకీ పెట్టి... ఈటల రాజేందర్‌ను(etela rajender) కాల్చాలని సీఎం కేసీఆర్(cm kcr) నిర్ణయించారని ఇందిరా శోభన్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంటలో ఉపాధి భరోసా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్స్, నర్సులు, గెస్ట్ లెక్చరర్లకు మద్దతుగా ఈనెల 27నుంచి యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్(gun park) అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. వైతెపా(ysrtp) రాజీనామా అనంతరం ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరే ఆలోచన లేదన్నారు.
ప్రజా సమస్యలే అజెండాగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నిక(huzurabad by elections) బాధ్యతలు కేటీఆర్‌కు(ktr) ఎందుకు ఇవ్వడం లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఉపఎన్నికల్లో తాను పోటీ చేయబోనని... నిరుద్యోగుల తరఫున మాత్రమే పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుకు దక్కుతుందన్నారు.