Indian Racing League winners: హుస్సేన్‌సాగర్ తీరాన నిన్న పున:ప్రారంభమైన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్) ముగిసింది. 417.5 పాయింట్లతో కొచ్చి టీమ్ మొదటి స్థానంలో నిలిచింది. 385 పాయింట్లతో హైదరాబాద్ రెండు, 282 పాయింట్లతో గోవా మూడో స్థానం, 279 పాయింట్లతో చెన్నై నాలుగు, 147.5 పాయింట్లతో బెంగళూరు ఐదు, 141 పాయింట్లతో దిల్లీ టీమ్ ఆరు స్థానాల్లో నిలిచాయి. సాగర్ చుట్టూ మొత్తం 2.7 కిలోమీటర్ల ట్రాక్ ఉండగా.. ఏడు ప్రాంతాల్లో ప్రేక్షకుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆదివారం కావడంతో పోటీలను వీక్షించేందుకు సందర్శకులు తరలివచ్చారు. సినీనటులు రామ్‌చరణ్, నాగచైతన్య తదితరులు రేసింగ్‌ను వీక్షించారు.
ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్.. విజేతగా గాడ్స్పీడ్ కొచ్చి - కారు పోటీలు
Indian Racing League winners : హైదరాబాద్‌లో ఎన్నో అవాంతరాలు నడుమ ప్రారంభమైన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రశాంతంగా ముగిసింది. పోటీల్లో దేశంలోని వివిధ నగరాలకు చెందిన రేసర్లతో పాటు విదేశీయులు పాల్గొనగా 417.5 పాయింట్లతో కొచ్చి మొదటి స్థానంలో నిలిచింది. 385 పాయింట్లతో హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకుంది.
Indian Racing League