సికింద్రాబాద్‌లో ఇంక్రెడిబుల్ ఇండియా సంస్థ... ఇంక్రెడిబుల్ వన్ పేరుతో హోటల్‌ను ప్రారంభించారు. 250 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీఓఓ ప్రవీణ్ కుమార్ చెప్పారు. రూ. 25 కోట్ల వ్యయంతో హోటల్‌ను నిర్మించినట్లు తెలిపారు. ప్రజల సహకారంతోనే విజయపథంలో దూసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. 2008లో సంస్థ ప్రారంభించినప్పటి నుంచి అనేక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు.
సికింద్రాబాద్‌లో ఇంక్రెడిబుల్ వన్ హోటల్ ప్రారంభం - నూతనంగా హోటల్
సికింద్రాబాద్‌లో ఇంక్రెడిబుల్ వన్ పేరుతో ఓహోటల్ ప్రారంభమైంది...విభిన్న రంగాల్లో విస్తరిస్తున్న ఇంక్రీడబుల్.. మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ముందుకు వస్తున్నట్లు ఆ సంస్థ సీఓఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
సికింద్రాబాద్ లో ఇంక్రెడిబుల్ వన్
ప్రతి సంవత్సరం రెండు హోటళ్లు ప్రారంభించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆ సంస్థ సీఓఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 100 కోట్ల వ్యయంతో ఆస్పత్రులను నెలకొల్పనున్నట్లు స్పష్టంచేశారు.
ఇదీ చూడండి :ఈ అవార్డు అమ్మకు అంకితమిస్తున్నా: కీర్తి సురేశ్