నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు పెరగ్గా, రాష్ట్రంలో తగ్గాయి. కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం 2019 నవంబర్‌తో పోలిస్తే ఈసారి ఏపీ వసూళ్లు 12% పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో ఏపీకి రూ.2,230 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అది రూ.2,507 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రాష్ట్రంలో వసూళ్లు రూ.3,349 కోట్ల నుంచి రూ.3,175 కోట్లకు (-5%) తగ్గాయి. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ వసూళ్లు కూడా గత నవంబర్ కంటే ఈసారి 1.42% వృద్ధి చెందాయి.
జీఎస్టీ: తెలంగాణలో తగ్గింది... ఏపీలో పెరిగింది - GST news
నవంబర్ నెలలో ఏపీలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2019 నవంబర్‌తో పోలిస్తే ఈ సారి జీఎస్టీ వసూళ్లు ఏపీలో 12శాతం పెరిగాయి. గతేడాది నవంబర్‌లో రూ.2,230కోట్ల ఆదాయం రాగా... ఈసారి 2, 507 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు తగ్గాయి.
జీఎస్టీ: తెలంగాణలో తగ్గింది... ఏపీలో పెరిగింది
గత నవంబరులో రూ.1.03 లక్షల కోట్లు రాగా.. ఇప్పుడు రూ.1.05 లక్షల కోట్లు వచ్చాయి. కేంద్ర ఖజానాకు గత ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో రూ.8,05,164 కోట్లు రాగా, ఈసారి ఇప్పటివరకు వసూలైన మొత్తం రూ.6,64,709 కోట్లకు చేరింది. గత ఏడాదికంటే ఇది 17.44%మేర తక్కువ.
ఇదీ చదవండి:'ఇంకా ఏడు రోజులే' అని నిహారిక పోస్ట్.. పెళ్లి కార్డ్ వైరల్