తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాలర్ల వలలో పీఎస్‌ఎల్​వీ రాకెట్ బూస్టర్‌' - జాలర్ల వలలో చిక్కిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ బూస్టర్‌

సముద్రంలో చేపలు పడుతున్న జాలర్లకు పీఎస్‌ఎల్​వీ రాకెట్ బూస్టర్‌ మంగళవారం లభ్యమైంది. చెన్నై.. పుదుచ్చేరిలోని వంబాకీరపాళెయానికి చెందిన జాలర్లు కొందరు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. తీరం నుంచి సుమారు 10 నాటికల్‌ మైళ్ల దూరంలో వలలో రాకెట్ బూస్టర్‌ చిక్కింది.

pslv
pslv

By

Published : Dec 4, 2019, 9:50 AM IST

చెన్నై పుదుచ్చేరిలోని వంబాకీరపాళెయానికి చెందిన జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో జాలర్లకు పీఎస్ఎల్​వీ రాకెట్ బూస్టర్‌ వలలో చిక్కింది.13.5 మీటర్ల పొడవు, మీటరు వెడల్పు కలిగి 16 టన్నుల బరువున్న దానిని 4 పడవలకు కట్టి తీరానికి చేర్చారు. దానిపై ఎఫ్‌ఎల్‌ 119, పీఎస్‌ఎంవో-ఎక్స్‌ఎల్‌, 23.2.2019 తేదీ అని రాసి ఉంది.

బూస్టర్‌ను వంబాకీరపాళెయం లైట్ హౌస్‌ దగ్గర ఉంచి శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం అధికారులకు సమాచారం అందించారు. జాయింట్ డైరెక్టర్‌ హోదాలోని అధికారి ఆధ్వర్యంలో నలుగురు పుదుచ్చేరికి చేరుకున్నారు. రాకెట్ బూస్టర్‌ను తీసుకెళ్లేందుకు 16 చక్రాల లారీ, దానిపైకి ఎక్కించేందుకు భారీ క్రేన్‌ను రప్పించారు.

కార్టోశాట్ బూస్టర్..!

బూస్టర్‌ కారణంగా నాలుగు వలలు పాడయ్యాయని, 30 మంది జాలర్ల ఒక రోజు జీవనాధారం పోయిందని మత్స్యకారులు వాపోయారు. మొత్తం రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని.. కనీసం రూ.10 లక్షలైనా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అప్పటి దాకా బూస్టర్‌ను తీసుకెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. పోలీసులు, తీర భద్రత దళం అధికారులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. అనంతరం తరలించారు. ఈ బూస్టర్‌ నవంబరు 27న ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహానికి సంబంధించిందని అంతరిక్ష ప్రయోగ కేంద్రం అధికారులు తెలిపారు.

pslv

ఇవి కూడా చదవండి:

రేపిస్టుల క్రూరత్వానికి కారణం ఏమిటో తెలుసా ?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details