తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐఎంఎస్​ కుంభకోణం: రూ.162 కోట్ల ఆస్తుల జప్తునకు అనిశాకు అనుమతి - ఐఎంఎస్​ కుంభకోణంలో

ఐఎంఎస్​ కుంభకోణంలో అనిశా పురోగతి సాధించింది. స్కాంలో నిందితునిగా ఉన్న బాబ్జీ, అతని కుటుంబసభ్యుల ఆస్తులను జప్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. బినామీ పేర్లతో రూ.162 కోట్లను జప్తు చేసుకునేందుకు అనుమతి సాధించింది.

ఐఎంఎస్​ కుంభకోణం: రూ.162 కోట్ల ఆస్తుల జప్తునకు అనిశాకు అనుమతి
ఐఎంఎస్​ కుంభకోణం: రూ.162 కోట్ల ఆస్తుల జప్తునకు అనిశాకు అనుమతి

By

Published : Aug 5, 2020, 6:49 AM IST

బీమా వైద్య సేవల కుంభకోణం (ఐఎంఎస్‌)లో అవినీతి నిరోధక శాఖ (అనిశా) మరింత పురోగతి సాధించింది. నిందితుడి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. నిందితుడిగా ఉన్న బాబ్జీ, అతని కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది.

పలు అక్రమాలకు పాల్పడి కోట్లు కూడబెట్టినట్లు ప్రభుత్వానికి అనిశా లేఖ రాసింది. ల్యాబ్‌ కిట్ల విక్రయంతో పాటు పలు అక్రమాలకు పాల్పడినట్లు తన లేఖలో పేర్కొంది. బినామీ పేర్లతో రూ.162 కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టినట్లు అనిశా గుర్తించింది. మరోవైపు బాబ్జీ అక్రమాలపై అనిశా న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.

ఇవీ చూడండి:గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

ABOUT THE AUTHOR

...view details