తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగులకు శుభవార్త... 11వ పీఆర్సీ అమలు దిశగా అడుగలు - Good news for the State employees

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వేతనాల పెంపునకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 10,12 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని వేతన సవరణ సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది.

ఉద్యోగులకు శుభవార్త... 11వ పీఆర్సీ అమలు దిశగా అడుగలు

By

Published : Nov 10, 2019, 11:39 PM IST

ఉద్యోగుల వేతనాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆదివారం సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని వేతన సవరణ సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. వాస్తవానికి 2018 జులై 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి రావాల్సి ఉంది. దీని కోసం 2018 మేలో రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ పీఆర్సీ కమిషన్.. గత ఏడాదిన్నరగా రాష్ట్రంలోని పరిస్థితులు, ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి అధ్యయనం చేస్తోంది. ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను పరిశీలిస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details