'హన్మకొండ నిందితుడిని తక్షణమే శిక్షించాలి' - pragathibhavan
తొమ్మిది నెలల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని తక్షణమే ఉరితీయాలని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు నిరసనకు దిగాయి. ఛలో ప్రగతి భవన్ పేరుతో తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకుని వారిని గోషామహల్ ఠాణాకు తరలించారు.
తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం చేసి హతమార్చిన నిందితుడు ప్రవీణ్‌ను వెంటనే ఉరి తీయాలంటూ పలు ప్రజా, మహిళ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎర్రమంజిల్ నుంచి ఛలో ప్రగతి భవన్ పేరుతో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ చేపట్టారు. పోలీసులు నిరసనను అడ్డుకొని వారిని గోశామహల్ స్టేడియానికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమన్నారు. నిందితుడిని శిక్షించే వరకూ తమ పోరు ఆగదని స్పష్టం చేశారు.