తెలంగాణ

telangana

ETV Bharat / state

రాగల రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు - Rain update from telangana

రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

రాగల రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు
రాగల రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు

By

Published : Oct 16, 2020, 7:07 PM IST

రాష్ట్రంలో ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.

దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర మహారాష్ట్ర - దక్షిణ గుజరాత్‌ తీరాలకు దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్రం దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య ఆరేబియా సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా మరే అవకాశం ఉందని పేర్కొంది.

ఈనెల 19న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని... తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఇవీ చూడండి: యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి

ABOUT THE AUTHOR

...view details