తెలంగాణ

telangana

ETV Bharat / state

Weather Update: తెలంగాణలో నాలుగైదు రోజులు తేలికపాటి వర్షాలు - telangana weather updates

తెలంగాణలో నాలుగైదు రోజులు తేలికపోటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 24 గంటల్లో హైదరాబాద్​లో మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయి.

imd
తేలికపాటి వర్షాలు

By

Published : Jun 24, 2021, 4:40 PM IST

రాష్ట్రంలో రాబోయే నాలుగైదు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనునున్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) ప్రకటించింది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, గ్రామీణం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించింది. ఇవాళ ఉపరితల ఆవర్తన ద్రోణి జార్ఖండ్ పరసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదగా దక్షిణ కోస్తాంధ్రా వరకు సముద్ర మట్టానికి 1.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వెల్లడించింది.

రేపు, ఎల్లుండి ఈ తీవ్రత తగ్గినప్పటికీ... 27, 28న మళ్లీ ఈ ద్రోణి ప్రభావం మళ్లీ తెలంగాణపై ఉండటం వల్ల ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు సూచనలు కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుందని నాగరత్న పేర్కొన్నారు.

ఇదీ చదవండి:VACCINATION: 'ఒకట్రెండు రోజుల్లో కోటి మార్క్‌కి వ్యాక్సినేషన్'

ABOUT THE AUTHOR

...view details