వాయువ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్ర - దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(imd hyderabad) ప్రకటించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
weather report: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(imd hyderabad) వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు(telangana rains) కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
imd-hyderabad-weather-report-disclosed-that-heavy-rains-in-next-two-days-in-telangana
ఫలితంగా రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి, రెండు చోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు(telangana rains)... మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ఇదీ చదవండి:Telugu Language Day: పలుకు పరవశం.. మాట మాధుర్యం.. ఇదీ తెలుగు గొప్పతనం!
Last Updated : Aug 29, 2021, 6:03 PM IST