ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరిజిల్లా దేవరపల్లి వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న రెండు క్వింటాళ్ల గంజాయినీ పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు రవాణా చేస్తుండగా పోలీసుల తనికీల్లో అక్రమ రవాణా బయట పడింది. గంజాయి విలువ సుమారు 10లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీర్రాజు, శివకళ్యాణ్, శివలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకొన్నారు.
10 లక్షల విలువైన గంజాయి పట్టివేత - ganjai
విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు అక్రమంగా కారులో రెండు క్వింటాళ్ల గంజాయినీ తరలిస్తుండగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ganjai
TAGGED:
ganjai