హైదరాబాద్లోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్, బాచుపల్లి గ్రామాల్లో మున్సిపల్ అధికారులు పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ఉన్నతాధికారులు శుక్రవారం రంగం సిద్ధం చేశారు. అక్రమ భవన నిర్మాణాల వద్ద కూల్చివేతలు ప్రారంభించారు. కొద్దిసేపటికి కూల్చివేతను నిలిపివేసిన అధికారులు వెనుదిరిగారు. తూతూమంత్రంగా కూల్చివేతలు చేపట్టి విధులు ముగించారు.
ముందు జాగ్రత్త అవసరం
దీనిపై స్పందించిన కమిషనర్ గోపి.. అక్రమంగా కట్టడాలు జరుగుతున్నాయని, ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా నిర్మాణాలు ఆగడం లేదని అన్నారు. అక్రమ కట్టడాల నిర్మూలనకి కూల్చివేతలు ఒక్కటే మార్గమని.. నేటి నుంచి నిరంతరం కూల్చివేతలు జరుగుతాయని తెలిపారు. ఈ రోజు 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు నిర్మాణం సక్రమంగా ఉందా లేదా అని తెలుసుకొని కొనాలని కోరారు.
ఇదీ చదవండి:నిత్య పెళ్లికొడుకులా ట్రాఫిక్ కానిస్టేబుల్