మాస్కు లేనిదే గడపదాటలేని పరిస్థితి. ప్రతిసారి కొత్త మాస్కు కొనాలంటే కుటుంబసభ్యులందరికీ కలిసి ఖర్చు భారీగా అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఐఐసీటీ శాస్త్రవేత్తలు సరికొత్త మాస్కును తయారు చేశారు.
మూడు, నాలుగు పొరలు కలిగి హైడ్రోఫోబిక్ పాలిమర్లతో బ్యాక్టీరియా, వైరస్‌లను సమర్థంగా నిలువరించేలా దీన్ని రూపొందించారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్లలో 0.3 మైక్రాన్ల పరిమాణం వరకు ఈ మాస్కు నిలువరిస్తుంది. గరిష్ఠంగా 60 నుంచి 70 శాతం వరకు వైరస్‌ను అడ్డుకుంటుందని ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.