Iftar Parties in Telangana: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని... రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లి గృహకల్పలోని టీఎన్జీఓఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేన్ ఆధ్వర్యంలో.. దావత్ ఇ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మైనార్టీ కమిషన్ ఛైర్మన్ తారిక్ హన్సారి, టీఎన్జీఓఎస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌తో పాటు.. ముస్లింలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
సంస్కృతి.. సంప్రదాయాలను కాపాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారు : ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని... మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ శివారులోని... సైలానీ బాబా దర్గాలో ఆత్మకూరు, దామెర మండలాల ముస్లింలతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి సంస్కృతి.. సంప్రదాయాలను కాపాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని.. మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో... ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి ఆమె హాజరయ్యారు.