తెలంగాణ

telangana

ETV Bharat / state

నంబరు ప్లేట్‌ మార్చారో.. ఊచలు లెక్కించాల్సిందే! - హైదరాబాద్​ తాజా సమాచారం

ద్విచక్ర వాహనాల నంబర్‌ ప్లేట్లను మారిస్తే.. ఊచలు లెక్కించాల్సి ఉంటుందని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ హెచ్చరించారు. మోటార్‌ వాహన చట్ట ప్రకారం ద్విచక్ర వాహనాల నంబర్లు ఉండాలని, లేకుంటే కేసులు పెడతామని తెలిపారు.

If you change the bike number plate, you will go to jail
నంబరు ప్లేట్‌ మార్చారో.. ఊచలు లెక్కించాల్సిందే!

By

Published : Jul 31, 2020, 2:47 PM IST

ద్విచక్ర వాహనాల నంబర్‌ ప్లేట్లను ఇష్టానుసారంగా మార్చేస్తే అరెస్టు తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దొంగతనాలు, గొలుసు చోరీలు చేసే నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనాల నంబర్‌ ప్లేట్లను మార్చుతున్నారని తెలిపారు.

మోటార్‌ వాహన చట్ట ప్రకారం ద్విచక్ర వాహనాల నంబర్లు ఉండాలని, లేకుంటే కేసులు పెడతామని కొత్వాల్‌ అంజనీకుమార్‌ అన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో నమోదు చేశామని, వాహనదారులపై న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు సమర్పించామని గుర్తు చేశారు. కొద్దిరోజుల నుంచి ఉల్లంఘనులు ద్విచక్ర వాహనం నంబర్‌ ప్లేటు కనిపించకుండా చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఇవీ చూడండి: 'రైతును లారీతో గుద్ది చంపిన ఇసుక మాఫియా'

ABOUT THE AUTHOR

...view details