ఏసీబీ దాడిలో పట్టుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావు స్పందించారు. సీఎంకు, సీఎస్‌కు తాను లేఖ రాసానంటూ అసత్య వార్తను ప్రచురించారన్నారు. అసలు ఎలాంటి ఉత్తరం రాయలేదని ఇదంతా కల్పితమని వెల్లడించారు. వాస్తవాలను ప్రజలకు అందిచాల్సిన మీడియా ఇలాంటి తప్పుడు కథనాలను అందించడం బాధాకరమన్నారు.
ముఖ్యమంత్రికి ఎలాంటి లేఖ రాయలేదు: ఏసీబీ డీజీ
తాను చేయని పనిని చేశానంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా ఉండాల్సిన మీడియా... ఇలాంటి కల్పిత వార్తను ప్రచురించడం సమంజసం కాదన్నారు.
కేసీఆర్‌కు ఎలాంటి లేఖ రాయలేదు: ఏసీబీ డీజీ