Akanksha Vidyasagar Suspicious death case : కర్ణాటక రాజధాని బెంగళూరులో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. బెంగళూరులోని జీవన్ బీమా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. యువతిని ప్రేమించిన దిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా సీన్ క్రియేట్ చేసేందుకు యత్నించినట్లు స్నేహితులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు, మృతురాలి స్నేహితులు తెలిపిన వివరాలు ప్రకారం.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్ (23) పని చేస్తోంది. అదే కంపెనీలో పని చేస్తోన్న దిల్లీకి చెందిన అర్పిత్ గుజ్రాల్‌తో ఆమెకు బాగా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొన్ని నెలలుగా జీవన్ బీమా నగర్ పరిధిలోని కోడిహళ్లిలోని ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.
- ప్రేమ.. పెళ్లి.. హత్య.. ఏ క్రైమ్ లవ్‌స్టోరీ
- శ్రద్ధ హత్య కేసులో మరో ట్విస్ట్.. త్వరలోనే గుడ్ న్యూస్ అని.. అంతలోనే హత్య!
ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు జరిగేవని స్నేహితులు తెలిపారు. చివరికి ఇరువురు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో తీవ్ర ఆగ్రహంతో అర్పిత్.. తన ప్రియురాలు ఆకాంక్షను గొంతు నులిమి హత్య చేసినట్లు స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత ఆకాంక్ష ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు తానే.. ఓ తాడును తీసుకొని ఆమె ఉరి వేసుకున్నట్లు సీన్ క్రియేట్ చేసినట్లు మృతురాలు స్నేహితులు చెబుతున్నారు.