Telangana Weather Report: తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు ఉపరితల ద్రోణి తూర్పు మధ్యప్రదేశ్ నుంచి.. విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు.. సగటు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తున ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు.
Telangana Weather Report: రాగల మూడు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు - హైదరాబాద్ తాజా వార్తలు
Telangana Weather Report: రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా సూర్యుడి తాపానికి గురవుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. రాగల మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాతావరణం
Last Updated : Jun 7, 2022, 6:27 PM IST