తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2021, 9:35 PM IST

ETV Bharat / state

hyderabad water supply: ఆ ప్రాంతాల్లో ఈ తేదీన నీటిసరఫరా నిలిపివేత..

hyderabad water supply : హైదరాబాద్ జంట నగరాల్లో ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం కలగనున్నట్లు జలమండలి ప్రకటించింది. 8 తేదీ ఉద‌యం 6 గంటల నుంచి.. 9 తేదీ ఉద‌యం 6 గంటల వరకు అంతరాయం కలగనుంది.

hyderabad water supply
hyderabad water supply

hyderabad water supply : పైపు లైన్ల మరమ్మతుల కారణంగా హైదరాబాద్​ జంట నగరాల్లో పలుచోట్ల నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి ప్రకటించింది. ఈనెల 8తేదీ ఉదయం 6 గంటల నుంచి 9తేదీ ఉదయం 6 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రజలు గమనించాలని జలమండలి వెల్లడించింది.

నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు

మిరాలం, కిష‌న్‌బాగ్‌, అల్ జుబైల్ కాల‌నీ, సంతోష్‌న‌గ‌ర్‌, విన‌య్ న‌గ‌ర్‌, సైదాబాద్‌, చంచ‌ల్‌గూడ‌, అస్మాన్‌గ‌ఢ్‌, యాకూత్‌పురా, మాద‌న్నపేట‌, మ‌హ‌బూబ్ మాన్షన్, రియాస‌త్‌న‌గ‌ర్‌, ఆలియాబాద్, బొగ్గుల‌కుంట‌, అప్జ‌ల్‌గంజ్, నారాయ‌ణ‌గూడ‌, అడిక్‌మెట్‌, శివం, న‌ల్లకుంట‌, చిల‌కల‌గూడ, దిల్‌సుఖ్‌న‌గ‌ర్, బొంగుళూరు, మ‌న్నెగూడలో అంతరాయం కలగనుంది.

ఇదీ చూడండి:Corona in medical college: వైద్య కళాశాలలో కొవిడ్​ కలకలం.. 39 మందికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details