తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎందుకొస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు? - ట్రాఫిక్​ పోలీసుల సర్వే

లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నా వందల మంది బయటకు వస్తున్నారు. రోజూ ఇలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నా గురువారం మరీ ఎక్కువ మంది రోడ్డెక్కడం వల్ల వీరంతా ఎందుకొస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో.. తెలుసుకోవాలని నగర ట్రాఫిక్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Hyderabad latest news
Hyderabad latest news

By

Published : May 9, 2020, 10:59 AM IST

హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని 25 ఠాణాల పరిధిలో శుక్రవారం సర్వే నిర్వహించారు. గంట వ్యవధిలో సగటున వెయ్యిమందిని ప్రశ్నించగా ఎక్కువ మంది బ్యాంక్‌లకు వెళ్తున్నామని, తమ ఇళ్ల సమీపంలోని మందుల దుకాణాల్లో మందులు లేనందున వేరే ప్రాంతంలో కొనేందుకు వస్తున్నామని తెలిపారు.

వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న బేగంపేట పోలీసులు 1180 మంది వాహనదారుల నుంచి వివరాలు సేకరించారు. మందులు కొనేందుకు, చికిత్సలకు 336 మంది, బ్యాంక్‌లకు 260, పాసులున్న వాహనదారులు 125, పోలీసులు, మీడియా ప్రతినిధులు 103, నిర్మాణరంగం 82, రెవెన్యూ, డిఫెన్స్‌, పౌరసరఫరాలు 73, జీహెచ్‌ఎంసీ 43, మద్యం కొనేందుకు 10 మంది ఉన్నారు. ఇక ఏ కారణం చెప్పనివారు, ఉల్లంఘనులు 148 మంది.

ABOUT THE AUTHOR

...view details