నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 439 మంది వాహనదారులకు జరిమానా విధించారు. నెంబర్ ప్లేట్లు లేకుండా ఉన్న వాహనాలు, ప్రమాణాల ప్రకారం నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు, అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ పెట్టుకున్న వాహనాలను నిలిపి తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం మోటారు వాహన చట్టం ప్రకారం నేరమని.... సంఘ విద్రోహ శక్తులు కూడా ఈ పద్ధతిలోనే వాహనాలను ఉపయోగిస్తారని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నెంబర్ ప్లేట్లు ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్లు లేకపోతే ఇక అంతే..! - hyderabad traffic police file case about who are not following motor vehicle act rules
నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్లు లేని 439 వాహనాలపై జరిమానా విధించారు. వాహనదారులు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నెంబర్ ప్లేట్లు ఉపయోగించాలని సూచించారు.
hyderabad traffic police
TAGGED:
hyderabad traffic police