2019లో అత్యధిక దేశీయ సందర్శకులు వచ్చిన పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ట్రావెల్ బుకింగ్ కంపెనీ బుకింగ్ డాట్ కామ్.. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది. తరువాతి స్థానాల్లో పుణె, జైపూర్, కొచ్చి, మైసూర్లు ఉన్నాయి. షిల్లాంగ్, మంగళూరు, రిషికేష్, గౌహతి, పుణెలలో దేశీయ పర్యాటకుల వృద్ధి ఎక్కువగా ఉందని నివేదిక అంచనా వేసింది.
టూరిజంలో హైదరాబాద్ నెంబర్ వన్ - దేశీయుల సందర్శనలో ముందు హైదరాబాద్యే
2019లో అత్యధిక దేశీయ సందర్శకులు వచ్చిన పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. దేశీయ పర్యాటకులు వెళ్తోన్న అంతర్జాతీయ గమ్యస్థానాల్లో దుబాయి ప్రథమ స్థానంలో ఉంది. ట్రావెల్ బుకింగ్ కంపెనీ బుకింగ్ డాట్ కమ్ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.
దేశీయుల సందర్శనలో ముందు హైదరాబాద్యే
దేశీయ పర్యటకులు వెళ్తోన్న అంతర్జాతీయ గమ్యస్థానాల్లో దుబాయి ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత బ్యాంకాక్, సింగపూర్, లండన్, కౌలాలంపూర్లు ఉన్నాయి. అదే సమయంలో ఇస్తాంబుల్, పుకెట్, వియాత్నం లాంటి ప్రాంతాలకు వెళ్లే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది.
ఇవీ చూడండి: ప్రగతిభవన్‌లో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీతో సీఎం భేటీ