హైదరాబాద్‌లో డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేక సర్వీసులు అన్ని మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాదు... ఆ రోజు రాత్రి మద్యం సేవించిన వారికీ మెట్రోలో అనుమతి ఇస్తున్నామన్నారు. అయితే... మద్యం సేవించిన వారు మాత్రం... తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని ఎన్వీఎస్రెడ్డి సూచించారు.
డిసెంబర్ 31న మందుబాబులకు మెట్రో స్పెషల్ ఆఫర్ - NEW YEAR CELEBRATION
డిసెంబర్ 31ని దృష్టిలో పెట్టుకుని నగరవాసులకు హైదరాబాద్ మెట్రో కిక్కెక్కించే ఆఫర్ ఇచ్చింది. రాత్రి ఒంటి గంట వరకూ ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని ప్రకటించిన మెట్రో... మందుబాబులను సైతం ఎక్కించుకుంటామని స్పెషల్ ఆఫరిచ్చింది.
HYDERABAD SPECIAL OFFER ON DECEMBER 31ST NIGHT