హైదరాబాద్ డిపోకు చెందిన తెలంగాణ ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారని... ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని హైదరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ భీంరెడ్డి తెలిపారు. బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. ఒక డ్రైవర్ బిక్కుకు కాలు విరిగిపోగా... మరో డ్రైవర్ యాదయ్యకు స్వల్పగాయమైంది. క్షతగాత్రులను స్థానిక మార్కండేయ అశ్వని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని భీంరెడ్డి పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు నంబర్ టీఎస్08జడ్199గా ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
సోలాపూర్‌లో పూర్తిగా దగ్ధమైన హైదరాబాద్ ఆర్టీసీ బస్సు
హైదరాబాద్‌కి చెందిన ఆర్టీసీ బస్సు... మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఏం కాలేదు.
సోలాపూర్‌లో పూర్తిగా దగ్ధమైన హైదరాబాద్ ఆర్టీసీ బస్సు