తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad Rains Today : హైదరాబాద్​లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తోన్న లోతట్టు ప్రాంతాలు.. జీహెచ్​ఎంసీ అలర్ట్ - Telangana latest news

Hyderabad Rains Today : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడటంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్​ఎంసీ మేయర్ విజయలక్ష్మి సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే జీహెచ్ఎంసీ, డీఆర్​ఎఫ్ సహాయం కోసం 040-21111111, 9000113667లో కంట్రోల్ రూమ్‌కు డయల్ చేయాలని సూచించారు.

Telangana Rains
Hyderabad Rains

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2023, 5:37 PM IST

Updated : Sep 10, 2023, 7:06 PM IST

Hyderabad Rains Today : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో.. సాయంత్రం వేళ భారీ వర్షం కురిసింది. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకపూల్, ఖైరతాబాద్​, కూకట్​పల్లి, హైదర్​నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, కేపీహెచ్​బీ కాలనీ, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, సనత్​నగర్, ఎస్ఆర్ నగర్, మైత్రివనం, అమీర్​పేట్​, మధురనగర్, యూసుఫ్​గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ట్యాంక్ బండ్, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్​రెడ్డి నగర్, మలక్​పేట్, చాదర్​ఘాట్, సైదాబాద్​లో వర్షం కురిసింది.

Himayath sagar gates are lifted : హిమాయత్​నగర్​ ఆరు గేట్లు ఎత్తివేత.. సర్వీస్ రోడుపైకి వరద నీరు

Telangana Rains :భారీగా కురిసిన వర్షంతో.. రహదారులన్నీ జలమయమయ్యాయి. నగరవాసులు తడిసి ముద్దయ్యారు. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చింతలకుంట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరదనీరు చేరింది. దీంతో ట్రాపిక్​ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం మరో గంట పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జంట నగరాలలో కురుస్తున్న వర్షానికి జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అప్రమత్తం అయ్యారు.

నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. సమస్యల పరిష్కారం కోసం.. జీహెచ్ఎంసీ, డీఆర్​ఎఫ్ సిబ్బంది హెల్ప్​లైన్​ నంబర్​ 040-21111111, 9000113667 కంట్రోల్ రూమ్‌కు డయల్ చేయాలని మేయర్ సూచించారు. మాన్​సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు, ఈవీడీఎం బృందాలు.. ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

నిండుకుండలా హుస్సేన్ సాగర్.. జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద

Telangana Weather Report Today :రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( IMD ) ప్రకటించింది. సోమవారం, మంగళవారం కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది.

Today Weather Report in Telangana : రాష్ట్రంలోని పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం వాయువ్యానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 12న ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. మరోవైపు శనివారం భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షానికి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పని ముగించుకుని వస్తున్న కార్మికులు తడిసి ముద్దయ్యారు. నగరంలో వర్షం కురిసిన పలు ప్రాంతాలు వరద నీటితో జలమయమయ్యాయి.

Hyderabad Rains Today హైదరాబాద్​లో భారీ వర్షం చెరువులను తలపిస్తోన్న లోతట్టు ప్రాంతాలు జీహెచ్​ఎంసీ అలర్ట్

Heavy Flow in Musi River : ఉద్ధృతంగా మూసీ.. జియాగూడ రహదారిపై రాకపోకలు నిలిపివేత

Last Updated : Sep 10, 2023, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details