తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad police about NRIs : ఆ పోస్టులు పెడితే ఎన్‌ఆర్‌ఐల పాస్‌పోర్టు, వీసా రద్దుకు సిఫార్సు

Hyderabad police about NRIs : విద్వేష పోస్టులు పెడితే ఎన్‌ఆర్‌ఐల పాస్‌పోర్టు, వీసా రద్దుకు సిఫార్సు చేస్తామని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ప్రజాప్రతినిధులపై విషం చిమ్మేలా పోస్టులు పెట్టే ప్రవాస భారతీయుల పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియో కాన్ఫరెన్స్​లో నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad police about NRIs, cp cv anand
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/05-January-2022/14098115_cv.jpg

By

Published : Jan 5, 2022, 8:12 AM IST

Hyderabad police about NRIs : విదేశాల్లో ఉంటూ.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సహా ప్రజాప్రతినిధులు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో విషం, విద్వేషం చిమ్ముతున్న ప్రవాస భారతీయులపై హైదరాబాద్‌ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. వారిపై కేసుల నమోదుతో పాటు పాస్‌పోర్టు, వీసాల రద్దుకు ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలకు సిఫార్సు చేయనున్నారు. ఆయా ప్రవాస భారతీయులకు విదేశీ పౌరసత్వం ఉంటే.. నమోదు చేసిన కేసుల వివరాలను ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు పంపనున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఈమేరకు అధికారులను ఆదేశించారు. ఆయా ఫిర్యాదులపై కమిషనరేట్‌లోని ప్రతి ఠాణాలో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నెల రోజుల్లోనే 70 ఫిర్యాదులు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాసగౌడ్‌, ప్రజాప్రతినిధులపై సామాజిక మాధ్యమాల్లో విద్వేష వ్యాఖ్యలు, వీడియోలు వందల సంఖ్యలో ఉంటున్నాయి. ఇవి ఎక్కువగా ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లలో వైరల్‌ అవుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు వీటిని పోలీసుల దృష్టికి తీసుకువస్తుండగా.. కొన్ని సందర్భాల్లో సైబర్‌ క్రైం విభాగమే సుమోటోగా కేసులు నమోదు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా ప్రముఖులు, ప్రజాప్రతినిధులపై ఇలాంటి ప్రచారాలపై గత నెల రోజుల్లోనే 70 ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఐపీ చిరునామాల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని, కొందరి అడ్రస్‌లు దుబాయ్‌, అమెరికాలో ఉన్నట్టు తేలిందని వెల్లడించారు.

పంచ్‌ ప్రభాకర్‌, రాజ్‌ బోడాలపై లుక్‌అవుట్‌ నోటీసులకు చర్యలు

‘‘విదేశాల్లో ఉంటూ.. మంత్రులు, ప్రజాప్రతినిధులపై విపరీత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్న పంచ్‌ ప్రభాకర్‌, రాజ్‌ బోడాలపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీచేయబోతున్నాం. సామాజిక మాధ్యమాల్లో వీరు పోస్ట్‌ చేసిన వీడియోలను తొలగించాలని ఇప్పటికే యూట్యూబ్‌, సామాజిక మాధ్యమాలకు తాఖీదులు జారీచేశాం. అమెరికా పౌరసత్వం ఉన్న పంచ్‌ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవడానికి అవసరమైన కీలక ఆధారాలను అన్వేషిస్తున్నాం’’ అని ఓ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:WhatsApp DP: వాట్సాప్​ డీపీలు పెడుతున్నారా.. అయితే బీ అలర్ట్​!

ABOUT THE AUTHOR

...view details