తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు: సీపీ ​ - happy new year

హైదరాబాద్​ నగరవాసులకు సీపీ అంజనీకుమార్​ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో పాల్గొనే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని చెప్పారు.

hyderabad police commissioner anjanikumar new year wishes to city people
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు: సీపీ ​

By

Published : Dec 31, 2019, 6:48 PM IST

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గస్తీ వాహనాల పనితీరు మరింత మెరుగుపర్చి.... నగరవాసులకు అందుబాటులోకి తెస్తామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నూతన సంవత్సరంలో హైదరాబాద్​కు గస్తీ వాహనాలు బ్రాండ్ అంబాసిడర్​గా మారతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే వారు... అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.... అంజనీ కుమార్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రయత్నించవద్దని సూచించారు. నిబంధనలు పాటించకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు.

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు: సీపీ ​

ABOUT THE AUTHOR

...view details