సామాజిక మాధ్యమాల్లో ఇతర రాష్ట్రాల్లో విధ్వంసం జరుగుతున్న వైరల్ వీడియోలను నమ్మవద్దని నగరవాసులకు సీపీ అంజనీకుమార్ సూచించారు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఆకస్మిక తనిఖీ చేశారు.
'చార్మినార్ వద్ద పరిస్థితులెలా ఉన్నాయో చూడాలనిపించింది' - hyderabad cp Anjani Kumar
హైదరాబాద్ పాతబస్తీ చారిత్రక చార్మినార్ వద్ద సీపీ అంజనీ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎలాంటి గొడవలు లేకుండా, ప్రశాంతంగా ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
చార్మినార్ వద్ద సీపీ అంజనీకుమార్ తనిఖీలు
విధులు ముగించాక ఒకసారి చార్మినార్ వద్ద పరిస్థితి ఎలా ఉందో చూడాలనిపించిందని, వెంటనే ఏసీపీ అంజయ్యకు ఫోన్ చేసి వచ్చానని సీపీ తెలిపారు. ఇక్కడి వ్యాపారులు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా తమ వ్యాపారం చేసుకోవడం చూసి సంతోషంగా అనిపించిందన్నారు.
Last Updated : Feb 27, 2020, 8:53 AM IST