హైదరాబాద్ పంజాగుట్ట రియాసత్ అలీ హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 కత్తులు, కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. రియాసత్ అలీకి పాత కక్షలే కారణమని సీపీ వెల్లడించారు. గతంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడైన రియాసత్ ఈ మధ్యే బెయిల్పై విడుదలయ్యాడు. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు సీపీ తెలిపారు. ఒక్క రోజులోనే కేసును ఛేదించిన సిబ్బందిని సీపీ అభినందించారు. నేరాల ఛేదనకు సాంకేతికత చాలా ఉపయోగపడిందని పేర్కొన్నారు.
పంజాగుట్ట హత్య కేసును ఛేదించిన పోలీసులు... ముగ్గురు అరెస్ట్ - PANJAGUTTA MURDER CASE UPDATES
పంజాగుట్టలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందుతులైన ముగ్గురిని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో పట్టుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
HYDERABAD POLICE CHASED PANJAGUTTA MURDER CASE IN ONE DAY
Last Updated : Oct 20, 2019, 7:56 PM IST